Teluguworld.wap.sh









విడుదల తేదీ : 28 మార్చి 2014
TeluguWorld.wap.sh : 3.75/5
దర్శకుడు : బోయపాటి శ్రీను
నిర్మాత : రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : బాలకృష్ణ, రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్, జగపతి బాబు… .

‘సింహా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సింహా’ తరహాలోనే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. బాలయ్యకి పోటీనిచ్చే నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ‘సింహా’ రేంజ్ ని మించేలా ఉందో? లేదో? ఇప్పుడు చూద్దాం…

కథ :
చిన్నప్పుడే ఇండియా నుంచి వచ్చేసి అంతా విదేశాల్లోనే పెరిగిన ప్రవాస భారతీయుడు కృష్ణ(బాలకృష్ణ). కృష్ణకి తన ఎదురుగా తప్పుచేస్తే నిలదీసే మనస్తత్వం ఉంటుంది. అతను విదేశాల్లో ఉన్నా అతని ఫ్యామిలీ అంతా అన్నవరంలోనే ఉంటుంది. కృష్ణ స్నేహ(సోనాల్ చౌహాన్)ని ప్రేమిస్తాడు. తన పెళ్లి కోసం ఇండియా వస్తానన్నా వాళ్ళ బామ్మ వద్దు మేమే అక్కడికి వస్తాం అని చెబుతుంది కానీ థ్రిల్స్ మాణిక్యం(బ్రహ్మానందం) చేసిన పనివల్ల కృష్ణ పెళ్లి ఇండియాలోనే చేసుకోవాలని వాళ్ళ బామ్మకి చెప్పా పెట్టకుండా ఇండియా వచ్చేస్తాడు.

అలా వచ్చిన కృష్ణ ఒకానొక సందర్భంలో జితేందర్(జగపతి బాబు) కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు. తన కొడుకును కొట్టిన వాడిని చంపాలి అని వచ్చిన జితేందర్ కృష్ణని చూసి షాక్ అవుతాడు. అప్పుడే జయదేవ్ (సీనియర్ బాలకృష్ణ) ఎంటర్ అవుతాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఈ జయదేవ్ ఎవడు? జయదేవ్ కి జితేందర్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది? అలాగే జయదేవ్ కృష్ణకి ఏమవుతాడు? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :
‘లెజెండ్’ సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరో మరియు బిగ్గెస్ట్ ప్లస్ అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే… బాలకృష్ణ పెర్ఫార్మన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. రెండు పాత్రల్లో మూడు విభిన్న గెటప్స్ లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యానికి ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ముఖ్యంగా చాలా రియలిస్టిక్ గా కనిపించే జయదేవ్ పాత్రలో అతని పెర్ఫార్మన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంది. కృష్ణ గా కూడా మంచి నటనని కనబరిచాడు. ముఖ్యంగా ఈ వయసులో కూడా అయన వేసిన డాన్సులు అభిమానులని బాగా అలరించాయి. నెగటివ్ షేడ్స్, అహం ఉన్న స్టైలిష్ విలన్ పాత్రలో జగపతి బాబు నటన బాగుంది. జగపతి బాబు బాలకృష్ణకి గట్టి పోటీనే ఇచ్చారని చెప్పాలి.

సెకండాఫ్ లో వచ్చిన రాధిక ఆప్టే ఎక్కువ సేపు ఉండకపోయినా ఉన్నంత వరకూ తన పాత్రకి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్ లో కనిపించిన సోనాల్ చౌహాన్ కి నటన పరంగా చేయడానికి ఏమీ లేకపోయినా బాగా గ్లామరస్ గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. సుమన్, సుహాసిని, సితార తదితరులు తమ పరిధి మేర నటించారు. మహిళలపై షూట్ చేసిన సీన్స్ మరియు కొన్ని సెంటిమెంట్ సీన్స్ మహిళా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయి.

ఈ సినిమాకి ప్రధాన హైలైట్ సెకండాఫ్. సెకండాఫ్ లో జయదేవ్ పాత్ర ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే బాలకృష్ణ డైలాగ్స్ కి చాలా బాగున్నాయి. సెకండాఫ్ లో బాలకృష్ణ – జగపతి బాబు ఒకరితో డీ కొట్టాలనుకునే సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చాలా బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తైతే ఇంటర్వల్ ఎపిసోడ్ మాత్రం ఒక ఎత్తు. ఆ ఎపిసోడ్ థియేటర్ లో చూస్తున్న ఆడియన్స్ ని ఒక రేంజ్ కి తీసుకెళుతుంది. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్ కి దేవీశ్రీ ప్రసాద్ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

మైనస్ పాయింట్స్ :
థ్రిల్స్ మాణిక్యంగా వచ్చే బ్రహ్మానందం పాత్రని కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన పాత్ర పెద్దగా నవ్వు తెప్పించకపోగా కథని సాగదీసినట్టు ఉంటుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఓ రేంజ్ లో ఉన్నప్పుడు ఆడియన్స్ క్లైమాక్స్ పై కూడా ఆడియన్స్ కి అంచనాలుంటాయి. కానీ ఆ అంచనాలను అందుకునే రేంజ్ లో క్లైమాక్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. హంసా నందిని ఐటెం సాంగ్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :
బాలకృష్ణని రియలిస్టిక్ లుక్ లో చూపించడంలో, డైరెక్టర్ అనుకున్నది ఇవ్వడంలో సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఫస్ట్ హాఫ్ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకొని కొన్ని అనవసర సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. ఎం. రత్నం డైలాగ్స్ అటు మాస్ ప్రేక్షకులని, ఇటు మహిళా ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు పరవాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది.

ఇక లెజెండ్ అనే షిప్ కెప్టెన్ బోయపాటి శ్రీను విషయానికి వస్తే కథ పాతదే అనిపించినా దానికి మంచి స్క్రీన్ ప్లేని రాసుకున్నాడు. ఇక ఎప్పటిలా తన ఫ్లేవర్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో డైరెక్టర్ గా ఆడియన్స్ ని మెప్పించాడు. అలాగే బాలకృష్ణని మరో సారి కొత్త లుక్ లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘సింహా’ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘లెజెండ్’ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్ లోనే ఈ ‘లెజెండ్’ ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానము లేదు. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక్క బాలకృష్ణ మాత్రం ఒక ఎత్తు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో బాలకృష్ణ చూపించిన వైవిధ్యం, పెర్ఫార్మన్స్ మెయిన్ హైలైట్ అయితే యాక్షన్ ఎపిసోడ్స్, జగపతి బాబు పెర్ఫార్మన్స్, పంచ్ డైలాగ్స్ లెజెండ్ కి బోనస్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడా బోర్ కొట్టే ఫస్ట్ హాఫ్, ఆశించిన స్థాయిలో లేని క్లైమాక్స్ సినిమాకి మైనస్ పాయింట్స్. ఈ వేసవి సెలవుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులను, మహిళా ప్రేక్షకులను, నందమూరి అభిమానులను అలరించి బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ కొట్టబోయే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’.



TeluguWorld.wap.sh:-3.75/5




Users Online


3663

Disneyland 1972 Love the old s